ఏపీ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వాటికి వెంటనే పాలనా అనుమతి ఇవ్వాలని... టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈనెల 15-20 నాటికి పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఉపాధిహామీ పనులు, గ్రామీణ రోడ్లు, తాగునీటిపై కీలకంగా చర్చించారు.