ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటీవల కాంగ్రెస్ నేతల తీరుపై హార్ధిక్ పటేల్ విమర్శలు గుప్పించారు.తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతా నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదాన్ని తొలగించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారనే ఊహాగానాలకు బలం చేకూరింది.రాష్ట్రంలో పార్టీ తరపున నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా తనను పిలవకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆయన్ను తమ పార్టీలో చేర్చుకోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి సారించింది. హార్ధిక్ పటేల్ ను తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.