రైతు భరోసా యాత్రలో భాగంగా ఈనెల 8న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తారు. రైతు భరోసా యాత్రలో పవన్ ఇప్పటికే 41 మంది రైతులకు రూ. లక్ష చెక్కులను అందజేశారు. ఇప్పుడు మరోసారి కర్నూలు జిల్లా రైతులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రెస్ నోట్ విడుదల చేశారు.రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని , గత మూడేళ్లలో సుమారు 373 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.