కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఎముకలు బలంగా అవుతాయి. పాలలో కాల్షియం ఎక్కువ. రోజూ పాలు తాగితే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా అవుతాయి. నారింజల్లో కాల్షియం ఎక్కువ. ఒక నారింజ పండులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వాటిలోని విటమిన్ D, సిట్రస్ శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. బాదం పప్పులు తింటే ఎన్నో లాభాలు. ఓ కప్పు వేపిన బాదం పప్పుల్లో 457ml కాల్షియం ఉంటుంది. ఇది బోన్లకు బలమే కాదు బాడీలో ప్రోటీన్లను కూడా పెంచుతుంది. తరచుగా అంజీర పండ్లు (డ్రై ఫ్రూట్స్ అయినా సరే) తింటే బాడీలో కాల్షియం పెరుగుతుంది. ఓ కప్పు అంజీరలో 242ml ఉంటుంది. తరచూ అంజీర తింటే ఎముకలు గట్టిగా అవుతాయి. పెరుగులో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. కొంత మందికి పాల రుచి నచ్చదు. వారు పెరుగు తినడం ద్వారా కాల్షియం పెంచుకోవచ్చు. పాలతో తయారుచేసే సీట్లు, జున్ను ఇతర పదార్థాల్లో కాల్షియం ఉంటుంది. వెన్నలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎముకల్ని పటిష్టంగా చేస్తుంది.