ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం పురస్కరించుకుని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా మసీదులు, ప్రార్థనా మందిరాలు/స్థలాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు జరుగకుండా బందోస్తు చేపట్టారు.జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.అనుమానితులు,అపరిచితులపై ప్రత్యేక నిఘా ఉంచారు.