సింగనమల మండలం పెరవలి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. దీంతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
మోటార్లు పని చేయకనో. పైపులు పగలడం వల్లనో. విద్యుత్ సమస్య వల్లనో తాగునీటి సమస్య ఏర్పడలేదు. నీటిని వదలడంలో లోపం వల్ల తాగునీటి సమస్య తీవ్రమైంది. ఈ విషయం పంచాయతీ కార్యదర్శి తెలిసినా మిన్నకుండిపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చాలారోజుల నుంచి సమస్యను సచివాలయ అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. నీరు రాకపోవడంతో తోటల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని అంటున్నారు. చేసేది లేక ఆందోళనకు దిగినట్లు తెలిపారు. అయినా పంచాయతీ సెక్రటరీ సరైన సమాధానం చెప్పకపోవడం బాధాకమని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, సర్పంచ్ స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.