పది పబ్లిక్ పరీక్షల్లో స్లిప్పులు అందించి ఓ యువకుడు పోలీసులకు చిక్కిన సంఘటన ఆలూరు పట్టణంలో చోటు చేసుకుంది. సోమవారం ఆలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే ఓ విద్యార్థినీకి మరకట్టు గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు కాపీలు అందించెందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన ఎస్సై రామానుజులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఆ యువకుడి సెల్ఫోన్ తీసుకొని పరిశీలించగా అందులో పరీక్ష ప్రశ్నపత్రం ఉండడంతో విచారిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. తమ బంధువుల అమ్మాయి కోసం తాను ఇక్కడికి వచ్చానని ఆ యువకుడు సమాధానం చెప్పాడు. ఇదిలాఉంటే పది పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపింగ్ జరగలేదని ఎస్ఐ వెల్లడించారు.