భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష, 15 వందల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ కోర్టు న్యాయమూర్తి కిరణ్ కుమార్ తీర్పునిచ్చారు. నాగోలు సాయినగర్ హిట్స్ లో ఉండే రాగిణి బ్రహ్మచారికి నల్గొండ జిల్లా ఇందుర్తి గ్రామానికి చెందిన రాధి కను ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరికి ఒక బాబు పుట్టాడు. కొత్తకాలం తర్వాత బ్రహ్మచారి మద్యానికి బానిసై భార్యను శరీరక, మానసిక వేధింపులకు గురిచేయడం మొదలెట్టాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. 2018 మే 1న భర్త వేధింపులు తాళలేక రాధిక సూసైట్ నోట్ రాసి చున్నీతో ఫ్యాన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ ఎస్ఐ రవికుమార్ నిందితుడు బ్రహ్మచారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. విచారణ అనంతరం రంగారెడ్డిజిల్లా కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి కిరణ్ కుమార్ నిందితుడు బ్రహ్మచారికి మూడేళ్ల కారగార శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులకు, సిబ్బందిని రాచ కొండ సీపీ మహేష్ భగవత్, అదనపు సీపీ సుధీర్ రెడ్డి అభినందించి రివార్డులు ప్రకటించారు.