భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చుంచుపల్లి మండల పరిధిలోని రామాంజనేయకాలనీలో ఓ యువకుడు మహిళపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గౌతంపూర్‌కు చెందిన శ్రీదేవి ఆర్థిక లావాదేవీల నిమిత్తం రామాంజనేయకాలనీలో నివాసముంటున్న ఓ యువకుడి ఇంటికి వచ్చింది. శ్రీదేవి తనకు రావాల్సిన అప్పు డబ్బు కావాలని యువకుడిని అడిగింది. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు కత్తితో మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa