ముస్లింలు రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటూ పేదలకు దానాలు చేస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. అసలు ముస్లింలు ఇంత పవిత్రంగా ఈ రంజాన్ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..? దానధర్మాలు ఎందుకు చేస్తారో తెలుసా..? వారు కఠోరమైన ఉపవాసాలు చేయడానికి గల కారణాలు ఏంటి..? అది తెలుసుకోవాలంటే ఒకసారి ఈ కథనాన్ని చదివేయండి..
రంజాన్ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో కఠోరమైన ఉపవాసాలతో జరుపుకుంటారు. అంతేకాదు శక్తికి మించి దానధర్మాలు పేదలకు చేస్తారు. నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాసాలను పాటించి ఆ అల్లా పై భక్తిని చాటుకుంటారు. ముస్లిం సోదరులు మరి ఇంతగా ఈ రంజాన్ పండుగను పవిత్రంగా భావించి కఠోరమైన ఉపవాసం దానధర్మాలు చేయడానికి గల కారణాలు ఇప్పటికీ చాలామందికి తెలవదు.
ఈ రంజాన్ మాసంలో ఖురాన్ ఆవిర్భవించడం వల్ల ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రంజాన్ మాసంలో పేదలకు ఒక్క రూపాయి దానం చేస్తే అందుకు పది ఇంతలుగా పుణ్యం వస్తుందని. ఖురాన్ లో చెప్పబడింది. ఖురాన్ లో చెప్పబడిన విధంగా అనుసరించి ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు ఎన్నో దానధర్మాలు చేస్తూ ఉంటారు.
అంతే కాదు ఖురాన్ కన్నా ముందు ఉన్న పవిత్రమైన మత గ్రంథాలు కూడా ఈ మాసంలోనే పుట్టాయని చెబుతారు. ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల దేవుడిపై భయభక్తులు కలుగుతాయని వారి ప్రగాఢ నమ్మకం. ఇక దుష్టశక్తులను, సైతానులను కూడా అంతమొందించే మాసంగా ఈ రంజాన్ మాసం పేర్కొనబడింది. అందుకే ముస్లిం సోదరులు ఈ పండుగను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు..
రంజాన్ మాసంలో చెడు మార్గాన్ని వదిలి మంచి మార్గంలో పయనించడం, దేవుడిపై భక్తి శ్రద్దలు కలగటం, దుష్టశక్తులను ఆ అల్లా అంతమొందించటం, చేసిన ప్రతి మంచి పనికి 10 ఇంతలుగా పుణ్యం పొందడం ఇలా చెప్పుకుంటూ పోతే రంజాన్ పండుగకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ముస్లింలు ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు.