జగ్గయ్యపేట పట్టణంలోని, మున్సిపల్ కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ కో-అర్డినేటర్ వేములకొండ తిరుపతి రావు గారి అధ్వర్యంలో గుంటూరు జిల్లాలో జరగబోయే ఉద్యోగ మేళా పోస్టర్ ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
అని, ఈనెల 7, 8 తేదీ లో గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని, కావున జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు మరియు వైసీపీ సోషల్ మీడియా సభ్యులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, మున్సిపల్ కౌన్సిలర్ సాధుపాటి రాజు, నూకల సాంబ, పూసల పుల్లారావు, దువ్వల రామకృష్ణ, కటగాని నరసింహరావు, జయంతిపురం సర్పంచ్ నరసింహరావు, sc నాయకులు కన్నమాల శ్యాముల్, సోషల్ మీడియా నియోజకవర్గ కోఆర్డినేటర్ నరేండ్ల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.