తిరువూరు మండలం, వావి లాల గ్రామంలోని మామిళ్ల చెరువులో పడి గ్రామానికి చెందిన వేల్పుల లాలయ్య (45) మృతి చెందాడు. మూడురోజుల నుండి గేదెలు ఇంటికి రాలేదు. చెరు వులో ఉన్నాయని తెలుసుకొని మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో వాటిని ఇంటికి తోలుకొచ్చేం దుకు వెళ్ళాడు. గేదెలను ఒడ్డుకు తోలెందుకు చెరు వులోకి దిగిన లాలయ్య కొంతదూరం వెళ్లిన తర్వాత పెద్ద గొయ్యిలో పడి మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వా సుపత్రికి తరలించారు.