కృష్ణా జిల్లా: కైకలూరు అక్రమంగా నాటుసారా తయారుచేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పి కె చక్రవర్తి హెచ్చరించారు. కైకలూరు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల కైకలూరు మండలం గుమ్మళ్ళపాడు గ్రామ పరిధిలో నిర్వహించిన దాడుల్లో భారీగా నాటుసారా బెల్లం ఊట స్వాధీనం చేసుకున్న విషయం విధితమే.
ఈ నేపథ్యంలో దీనికి బాధ్యులైన ఘంటసాల చిన్నోడు నాగరాజు ను మంగళవారం అరెస్టు చేశారు. చట్టప్రకారం కఠినంగా శిక్షించేందుకు వెనకాడబోమని తెలిపారు ఈ కార్యక్రమంలో సి ఐ. కె వి ఎల్ నాయుడు రూరల్ ఎస్ ఐ చల్లా కృష్ణ పాల్గొన్నారు