సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా ఓ ఎస్సై భార్యకు చెందిన బ్యాగ్ కొట్టేశారు. బంగారు నగలు అపహరించారు. ఈ మహిళ తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో దొంగలు తమ పని సులువుగా చేసుకుంటూ పోతున్నారు. పోలీసులు నిఘా ఎంత ఉన్నా దొంగలు ఎక్కడ ఎలా ఉన్నారో పసిగట్టడం కష్టంగా మారింది.
అయితే ఎప్పటికప్పుడు మైక్‌లో ప్రచారం చేస్తూనే ఉన్నారు. భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా భక్తులు విలువైన వస్తువులు, సామగ్రీ తీసుకురావొద్దని ముందునుంచే హెచ్చరించారు. అయినా సరే కొందరు బంగారు ఆభరణాలతో అప్పన్న దర్శనానికి తరలివస్తున్నారు. ఇటువంటి వారిపై దొంగలు టార్గెట్ పెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా బ్యాగులు కొట్టేస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.