కోయంబత్తూర్‌లోని తొండముతూర్‌లో వృద్ధురాలి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 28న జరిగిన ఈ ఘటనలో బాధితురాలిని కలియమ్మళ్‌గా గుర్తించారు. ఆమె నరసింహపురం రోడ్డులో వెళుతుండగా హైఎండ్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు కలియమ్మాళ్‌ను అడ్రస్ అడిగారు.ఎటువెళ్లాలో ఆమె చెబుతుండగా ఆమె మెడలోంచి 44 గ్రాముల బంగారు చైన్‌ను గుంజుకుని పరారయ్యారు. తొండముతూర్ పోలీస్ స్టేషన్‌లో కలియమ్మాళ్ ఫిర్యాదు చేయగా సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితులను సోమయంపాళేనికి చెందిన ప్రసాద్ (20), తేజస్విని (20)గా గుర్తించారు.
వీరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారని వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని వెల్లడైంది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరూ ఉన్నత కుటుంబానికి చెందిన వారైనా ప్రసాద్ గ్యాంబ్లింగ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని వెల్లడైంది.