రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు పెరుగుదల, అధికమైన కరెంట్ కోతలకు నిరసనగా "బాదుడే బాదుడు" కార్యక్రమాల్లో భాగంగా పల్నాడు జిల్లా, దాచేపల్లి టౌన్ లోని నారాయణపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి కారంపూడి రోడ్డు వరకు వేలాది మంది గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానుల మధ్య "కొవ్వొత్తులతో భారీ నిరసన" కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పెరిగిన విద్యుత్ చార్జీల గురించి, పెరిగిన కరెంటు కోతల గురించి, ఆర్టీసీ ఛార్జీల పెంపుదల, నిత్యావసరాల పెరుగుదల,గ్యాసు, పెట్రోలు, డీజిల్ పై అదనపు భారం వంటి అనేక కార్యక్రమాల ద్వారా జగన్ రెడ్డి "బాదుడే బాదుడు" కి ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజానీకానికి అండగా నిలుస్తూ నిరసన తెలియజేయడం జరిగింది.