టెస్లా CEO ఎలన్ మస్క్ ట్విటర్ అకౌంట్‌కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. ట్విటర్‌కు కాబోయే బాస్ మస్క్ ట్విటర్ ఫాలోవర్లలో సగం వరకు నకిలీవని వెల్లడైంది. ట్విటర్ ఆడిటింగ్ టూల్ "స్పార్క్‌టోరో" ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్క్‌కు ఉన్న 8.79 కోట్ల ఫాలోవర్లలో.. 48 శాతం ఫేక్ అని తేలినట్లు టైమ్ మేగజైన్ పేర్కొంది. ఈ ఖాతాల్లో ఎక్కువ స్పామ్, యాక్టివ్‌గా లేని అకౌంట్లు ఉన్నాయి.