కారు ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తున్నందుకు పోలీసు కానిస్టేబుల్ ఓ కారు డ్రైవర్ దాడికి దిగాడు. ఈ ఘటన బీమవరంలో చోటుచేసుకుంది. స్థానిక గునుపూడిలో ఓ వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనదారులను ఇబ్బంది పెట్టాడు. అతన్ని ఆపినందుకు కానిస్టేబుల్ పై ఇష్టారాజ్యంగా పిడిగుద్దులతో దాడి చేశాడు. భీమవరం గునుపూడి ప్రాంతానికి చెందిన బొబ్బనపల్లి సంతోష్ ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ ఓ వ్యక్తిని గుద్దడమే కాకుండా బైక్ పై వెళుతున్న మరో వ్యక్తిని గాయపరచాడు.
వీరమ్మ పార్క్ వద్ద ఓ కానిస్టేబుల్ కు అతని ర్యాష్ డ్రైవింగ్ చూసి కారును ఆపాడు. అయితే కారు డ్రైవర్ సంతోష్ రెచ్చిపోయాడు. కానిస్టేబుల్ అని కూడా చూడకుండా భూతులు తిట్టాడు. కానిస్టేబుల్ కు మెడ, చేతి భాగాల్లో గాయాలు చేశాడు. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపలోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ సంతోష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్ తెలియజేశాడు.