ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అనడంలో సందేహం లేదు. తాజాగా తిరుపతిని మెడికల్ హబ్‌గా చేస్తున్నట్లు తెలుస్తుంది . నాడు-నేడు ద్వారా రాయలసీమ పెద్దాసుపత్రి రుయాను రూ.450 కోట్లతో ఆధునీకరిస్తోంది. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను మరింత ఆధునీకరించి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇప్పటికే గత ఏడాది అక్టోబర్ 11న టీటీడీ శ్రీపద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు తాజాగా తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోంది. ఈ సందర్భంగా అత్యాధునిక వైద్య సేవలతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాం. దీని నిర్మాణానికి టీటీడీ, ఏపీ ప్రభుత్వ సహకారం మరువలేనిది. లాభాపేక్ష లేకుండా ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని సాధారణఖర్చుతో అందించడమే టాటా సంస్థ లక్ష్యం అని, తిరుపతి, క్యాన్సర్ ఆసుపత్రి, మెడికల్ డైరెక్టర్, డాక్టర్ విఆర్ రమణన్ తెలిపారు.