దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాలో నయా మోడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. ఈ కారు రూ.13.51 లక్షల నుంచి రూ.18.18 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.వీటిలో ఆరు-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన పెట్రోల్ వెర్షన్ రూ.13.51 లక్షల నుంచి రూ.17.22 లక్షల మధ్యలో, అలాగే డీజిల్ వెర్షన్ రూ.14.47 లక్షల నుంచి రూ.18.18 లక్షల మధ్యలో నిర్ణయించింది. వీటితోపాటు ఐఎంటీ(ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) కలిగిన క్రెటా పెట్రోల్ ఎస్ ట్రిమ్ మోడల్ ధర రూ.12.83 లక్షలు.