జనసేన పార్టీ ప్రజలకి కష్టం వస్తే చాలు ముందంజలో ఉంటుందనే చెప్పాలి, ప్రజా సమస్యలపైనా జనసేన చేస్తున్న పోరాటం ఒక విన్నూత రీతిలో కొనసాగుతుంది. ధర్నాలు, రాస్తా రోకులు , నిరసనలు , ర్యాలీలు చెయ్యడం తో కొంత మేరకు ప్రజల సమస్యలని తీర్చడానికి అవకాశం ఉందని వీరి నమ్మకం. అలానే సమస్యని పెద్ద స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా సమస్యకి త్వరగా సమాధానం దొరుకుతుందనే భావనతో వీరు అవలంబిస్తున్న తీరు, ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించిన బాధితులకి మాత్రం న్యాయం జరగడానికి ఎక్కువ అవకాశం ఉందనే చెప్పాలి. ఈ క్రమంలోనే ... ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను పునరుద్దించవలసిందిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలియజేస్తూ ధర్మవరం R.D.O గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.