రైతులకు భారత వాతావరణ విభాగం అయిన ఐఎండీ శుభవార్త చెప్పింది. 2022లో 99 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వ్యవసాయ రంగానికి వర్షాల పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుందని తెలపింది. ఒక రిపోర్ట్ ద్వారా ఐఎండీ ఈ ప్రకటనను విడుదల చేసింది. భారీ వర్షాల వల్ల పంటలకు ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.