ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీ రేట్లు పెంచక తప్పలేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. రెండేళ్ల తర్వాత ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది.