ఈ నెల 16 న జరిగే సంబేపల్లె గ్రామంలోని శ్రీ దేవర రాయి నల్లగంగమ్మ తల్లి తిరుణాలను జయప్రదం చేద్దామని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సంబేపల్లె గ్రామ సచివాలయంలో జరిగిన తిరుణాల గోడ పత్రిక ఆవిష్కరణలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, జెడ్ పి టిసి గొర్ల కవిత, గొర్ల రమేష్ రెడ్డి, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది ఎన్ ప్రభాకర్ రెడ్డి, వివి ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ అంచల రామచంద్ర, ఎంపిటిసి భద్రయ్య లతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేవర రాయి నల్లగంగమ్మ తల్లిఆలయం దినదినాభివృద్ది చెందుతోందన్నారు. తిరుణాలకు వచ్చే భక్తులుకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ కొండారెడ్డి, తహశీల్దార్ సత్యానంద్, ఎంపిడిఓ నరసింహులు , కమిటీ సభ్యులు గడికోట చంద్రశేఖర్ రెడ్డి, నూకల పాపులమ్మ, భూషణం గిరిజ శరత్ భూషణ్, ఉప సర్పంచ్ మోడెం హేమంత్, తిరుణాల సేవకులు సుధీర్ రాజు తదితరులు పాల్గొన్నారు.