ఎనర్జీ సంబంధిత అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్, సంబంధిత అధికారులతో ఈ రోజు సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. విద్యుత్ డిమాండ్–సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. డీబీటీద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాల్లో వేస్తామని, నేరుగా రైతులే చెల్లిస్తారని, దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతు ప్రశ్నింగలుగుతాడని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్ విజయవతం అయ్యిందని, 2020–21లో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 ఎం.యు. కరెంటు ఖర్చుకాగా, 2021– 2022లో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరినా 67.76 ఎం.యు. కరెంటు మాత్రమే వినియోగించమని అధికారులు వెల్లడించారు దీని వలన 33.75 ఎం.యు. కరెంటు ఆదా ఐనట్లు సీఎం జగన్ కి తెలియచేసారు.ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.