జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా హోంగార్డును సత్కరించిన అదనపు ఎస్పీ . మూడు దశాబ్దాలు పైబడి జిల్లా పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందిన మహిళా హోంగార్డు ఏ.లక్ష్మి నరసమ్మను ఘనంగా సన్మానించారు. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నాగేంద్రుడు తన ఛేంబర్లో పూలమాల వేసి...శాలువ కప్పి సత్కరించారు. 1991 సంవత్సరంలో హోంగార్డుగా చేరి మంచి సేవలు అందించిందని ప్రశంసించారు.