టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, చంద్రబాబు క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించకపోతే తాము ఇచ్చామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నామని చెప్పారు. టీడీపీ విపక్షానికి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఆర్బీకే లు ఐక్యరాజ్యసమితి అనుబంధ FAO అవార్డుకు నామినేట్ కావడం గర్వకారణమన్నారు.