భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన ఓ ఫోటో అసక్తికర చర్చకు దారితీస్తోంది. భారత ప్రధాని మోదీ ప్రస్తుతం యూరప్ దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు ఉక్రెయిన్-రష్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో మోదీ పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది. ఆదివారం జర్మనీలో పర్యటించిన మోదీ... అక్కడి నుంచి డెన్మార్క్ కు వెళ్లారు. అయితే ఆయన జర్మనీకి వెళ్లిన సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో 1993లో మోదీ ఈ ఫొటో దిగారు. ఫొటోలో ఆయనతో పాటు ఆయన సహచరుడు కూడా ఉన్నారు.
ఈ ఫొటో దిగినప్పుడు ఆయన కేవలం బీజేపీ సాధారణ నాయకుడు మాత్రమే. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగి... ఇప్పుడు దేశ ప్రధాని హోదాలో జర్మనీకి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa