ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్​ లో అరుదైన వివాహం

national |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 12:16 PM

బీహార్​ లోని భగల్​పుర్ ​లో ఓ అరుదైన వివాహం జరిగింది. నవ్​గాచియాలోని గోపాల్​పుర్​ బ్లాక్​ లో ఇద్దరు మరుగుజ్జు వధూవరులు పెళ్లి చేసుకున్నారు. అభియా బజార్ ​లో నివసించే కిషోరి మండల్​ కు మమతా(24) అనే కుమార్తె ఉంది. ఆమె ఎత్తు 34 అంగుళాలు. బిందేశ్వరి మండల్​ కుమారుడు మున్నా భారతి(26) ఎత్తు 36 అంగుళాలు.


మున్నాను చూసిన మమతా సోదరుడు అతని కుటుంబంతో పెళ్లి గురించి మాట్లాడాడు. మున్నా కుటుంబం ఒప్పుకోవడంతో మమతా, మున్నా ల పెళ్లి సంప్రదాయబద్దంగా జరిగింది. మున్నా భారతి డ్యాన్స్​ పార్టీలో ఆర్టిస్ట్​గా పనిచేస్తున్నాడు. తన భార్యను సంతోషంగా చూసుకుంటానని చెబుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa