తిరుమల ఆలయంలో ఈ నెల 3న కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్‌లో చిన్నారి క్షేమంగా ఉన్నాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తిరుమల అఖిలాండం వద్ద బాలుడిని కిడ్నాప్ చేసిన పవిత్ర బాలుడిని తీసుకొని మైసూర్ వెళ్లింది. తన తల్లిదండ్రుల వద్దకు బాలుడిని తీసుకెళ్లింది. చిన్నారిని ఎందుకు తీసుకొచ్చావని పవిత్ర తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం తిరుమలకు వచ్చి బాలుడిని టీటీడీ విజిలెన్స్ పోలీసులకు అప్పగించారు. మతిస్థిమితం లేక బాలుడిని తమ కూతురు తీసుకొచ్చిందని పోలీసులకు కిడ్నాపర్ పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు.