మహిళకు మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించిన ఇద్దరిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ బోర్డర్ దాటి కోల్‌కత్తాకు చేరింది. ఓ యువతి. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి విశాఖకు తరలించి.. వ్యభిచారం చేయించే ప్రయత్నం చేశారు దుండగులు. విషయం పసిగట్టిన బాధితురాలు తన సోదరుడుకి సమాచారం ఇవ్వగా, అతను వైజాగ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పెందుర్తికి చెందిన వినీత్, ధనలక్ష్మిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని తన సోదరుడికి అప్పగించారు.