అనంతగిరి మండలంలో కివర్ల పంచాయతీ కేంద్రం లోమహిళా రైతులకు పకృతి వ్యవసాయ పద్ధతులపై ఆర్‌వైఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఐసిఆర్పీ కేతా వీర్రన్న అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంట దిగుబడి పెంచుకోవడం కోసం అధిక మొత్తంలో రసాయనక ఎరువులు వాడకం వల్ల భూసారం క్షిణిస్తుందన్నారు. పకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చాన్నారు. అలాగే భూమిలో పలు రకాల పంటలు వేయడం వల్ల ఆర్థిక పరిపుష్టి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు పాల్గొన్నారు.