కోనేరులో ఈత కోసం వెళ్లిన వ్యక్తి కోనేరులో మృతదేహం తేలింది సంఘటన బుడతనాపల్లి లో చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గంట్యాడ మండలం బుడతనాపల్లి లోని కోనేరులో స్నేహితులతో కలిసి ఈత కోసం కోనేరు లో దిగి అదృశ్యమైన కొంచాడ రామకృష్ణ మృతదేహం గురువారం ఉదయం అదే కోనేరులో తేలింది. కోనేరు నీటిలో తేలిన రామకృష్ణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అతని కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కోనేరు వద్దకు చేరుకున్నారు. రామకృష్ణ కుటుంబీకులు గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తూ పరుగు పరుగున చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో గంట్యాడ ఎస్. ఐ కిరణ్ కుమార్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెరువులో తేలిన రామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడు రామకృష్ణకు భార్య, పాప ఉంది. ప్రస్తుతం అతని భార్య 8 వ నెల గర్భవతి. ఎస్. ఐ కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.