అన్నం పెట్టిన జగనన్న, ఆసరా ఇచ్చిన జగనన్న, చదువు అందించిన జగనన్న, ఆనందం పంచిన జగనన్న, అన్నదాతలకు అండగా ఉన్న జగనన్న.. ఈ ప్రశంసలేవీ చంద్రబాబుకు సహించడం లేదు. కరువుకు ప్యాంట్ షర్ట్ వేస్తే అది చంద్రబాబే. అందుకే ఇవాళ సిగ్గులేకుండా బాదుడే బాదుడు అంటూ కార్యక్రమం మొదలుపెట్టాడు. కానీ, సీఎం జగన్ పేదలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. వయసు తేడా లేకుండా.. కుల, వర్గాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేస్తున్న తెలుగు దేశం పార్టీని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బాది పంపించారు. వాళ్ల వ్యవహారం ఇలాగే కొనసాగితే.. 2024లోనూ చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదని మంత్రి రోజా తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యా దీవెన సొమ్ము జమ కార్యక్రమంలో చెప్పారు.