వచ్చే నెలలో ఏపీ రాష్ట్రంలో పీఎం మోదీ పర్యటనపై బీజేపీ నేతలు సమాలోచనలు జరిపారు. టీడీపీ, వైసీపీ కి సమానదూరం పాటించాలన్న విషయాన్ని పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పొత్తులపై కేడర్ అయోమయంలోకి వెళ్లకుండా చూడాలని నేతలకు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. ఈ నెల చివరి వారంలో ఏపీ రాష్ట్రానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రిని తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించే అంశంపై చర్చించారు.