ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా సుమారు 1.49 కోట్ల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. 2020 జనవరి 1 నుంచి 31 డిసెంబర్ 2021 మధ్య కాలంలో కరోనాతో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సంభవించిన మరణాలను డబ్ల్యూహెచ్వో ఈరోజు ప్రకటించింది. ప్రపంచంలో మొత్తం 1.49 కోట్ల మంది మరణించినట్లు తెలిపింది. అయితే, ఇండియాలో సుమారు 47 లక్షల మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించింది.