జమ్మూకాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 83 నుంచి 90కి పెంచాలని ప్రతిపాదించింది. జమ్మూలో 6 స్థానాలు, కశ్మీర్‌లో 1 స్థానం అదనంగా పేర్కొంది. తొలిసారి STలకు 9 సీట్లు కేటాయించింది. అయితే ఈ డీలిమిటేషన్‌ను అంగీకరించేది లేదని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు.