బొగ్గు కొరత తీర్చేందుకు ప్యాసింజర్ రైళ్లు రద్దు దేశంలో బొగ్గు కొరతను తీర్చేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలిచేందుకు 1100 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైల్వేశాఖ 650 సర్వీసులను రద్దు చేసింది. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుండటంతో మే 24 వరకు ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను రద్దు చేసి, బొగ్గు తరలింపుకు ఉపయోగించనున్నారు.