నెల్లూరు జిల్లాలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు నది రోడ్డుమీద ఒక వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించింది ఒక ముఠా . దాదాపుగా 40 మంది వరకు బైకులు , కార్ లలో చేరి కర్రలు, రాడ్లు, రాళ్లతో ఒక వ్యక్తి మీద దాడి కి తెగబడటం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు ఐనది. ఐతే ఈ సంఘటన వెనక వైసీపీ నాయకులూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు అని టీడీపీ వర్గీయుల వాదన. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరుడు ప్రసాద్ రెడ్డి తన గూండాలతో.. కొడవలూరుకి చెందిన నితిన్ రెడ్డిపై నడిరోడ్డుపై హత్యాయత్నం చేశాడు. మెయిన్‌రోడ్డుపై, పట్టపగలు అంతా చూస్తుండగానే దాడులకు పాల్పడ్డారు. వైసీపీ నేతల ఒత్తిడితో ఈ కేసుని పోలీసులు నీరుగార్చేందుకు యత్నిస్తున్నారు అని వీరు తెలియచేసారు.