రాష్ట్రంలో క్రొత్తగా ఏర్పాటైన జిల్లాలలో ఒక్కటైనా పల్నాడులో శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించిన ఊరుకునేది లేదు అని పల్నాడు జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగానే, జిల్లాలోని అన్ని సెగ్మెంట్స్ లో ఉన్న పాత రౌడీ లను అందరిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేసింది. పల్నాడు జిల్లాలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపిన జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లోని రౌడీ షీటర్లు,పాత నేరస్తులు,చెడు నడత కలిగిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగినది. పల్నాడు జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడమే తమ ధ్యేయమని,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలను ఉపేక్షించబోనని తెలిపారు.అలానే నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలతండ గ్రామం నందు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 4100 రూపాయలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసారు.