ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్సు వివాదాలు హల్చల్ చేస్తున్న క్రమంలో ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్యగా చెప్పవచ్చు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా నాయుడుపేట లో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్ పై సొంత ఊరికి తీసుకెళ్ళాడు ఓ తండ్రి. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కి.మీ బైక్ పై సొంత గ్రామం కొత్తపల్లి కి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది. ఈ విషయం మీద స్పందించిన టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ... మీపై కుళ్ళు, కుతంత్రాలతో దుష్ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చు ఏమో కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జగన్ రెడ్డి గారు. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి పని పై దృష్టి పెట్టండి. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయి అని హితవు పలికారు.