కృష్ణా జిల్లా: తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తిరువూరు తహశీల్దార్ నరసింహారావు. సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగు విధానాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.