సన్‌రైజర్స్ ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 5 మ్యాచ్‌లు గెలిచింది. సన్‌రైజర్స్ మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లు సన్‌రైజర్స్‌కు కీలకం. సన్‌రైజర్స్ కనీసం 3 మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఒక్క మ్యాచ్ లోనైనా భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగవడంతో పాటు ఇతర జట్లతో ఎలాంటి గొడవ ఉండదు.
సన్‌రైజర్స్‌లో ముంబై మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆర్‌సిబి, కెకెఆర్ మరియు పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ప్రస్తుతం 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్‌కు మరో నాలుగు మ్యాచ్‌లు ఉండగా, ప్రస్తుతం ఆ జట్టు 8 పాయింట్లతో ఉంది. మరో మ్యాచ్‌లో ఓడిపోతే ఆ జట్టు దాదాపు ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించడం ఖాయం. అదే జరిగితే సన్‌రైజర్స్‌కు ప్లస్సవుతుంది. పంజాబ్ కింగ్స్‌కు మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ మాత్రం మైనస్‌గా ఉంది. కాబట్టి ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడినా దాదాపు ప్లేఆఫ్‌కు దూరమైనట్లే. దీంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే కేకేఆర్, పంజాబ్ కింగ్స్‌ల విజయాలు కీలకం.