ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 15న వైయ‌స్సార్‌ రైతుభరోసా నిధుల జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 12:59 PM

వైఎస్సార్‌ రైతుభరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు. అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం నేటి (శుక్రవారం) నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలిస్తారు.


ఎవరైనా అనర్హులుంటే వారి పేర్లను తొలగించడంతోపాటు జాబితాలో చోటుదక్కని అర్హులెవరైనా ఉంటే వారి అభ్యర్థనలను స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హతను నిర్ధారించుకున్న తర్వాత వారికి భరోసా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. వైఎస్సార్‌ రైతుభరోసా కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీభూమి సాగుదారులు, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సాగుదారులను గుర్తించి మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com