రత్నగిరి నగర్ లో నివాసం ఉంటున్న కందుకూరి బంగారమ్మ అనే మహిళను కేసులో నుంచి తప్పిస్తానంటూ ముత్యాల శ్రీనివాసరావు వ్యక్తి మోసం చేశాడని బాధితురాలు నల్లపాడు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. తన తమ్ముడు భార్య కొన్నిరోజులు క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆకేసులో బంగారమ్మ ని, తన తమ్ముడిని, చెల్లిని పోలీసులు ముద్దాయిలుగా చేర్చారు. ఆకేసులో ఆముగ్గురిపై కేసు లేకుండా చేస్తానంటూ, రత్నగిరి కాలనీకి చెందిన ముత్యాల శ్రీనివాసరావు తన వద్ద కొంత నగదు తీసుకుని తనని మోసం చేశాడని, అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ గురువారం రాత్రి బాధితురాలు పిర్యాదు చేసినట్లు, విచారిస్తున్నట్లు నల్లపాడు పోలీసులు గురువారం రాత్రి తెలిపారు.