గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయాన్ని దేవాదాయ, గ్రామస్తుల సహకారంతో కోటి రూపాయల ఖర్చుతో పునః నిర్మాణం, స్వామి వారి విగ్రహాల పునః ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ధ్వజ స్థంభం వద్ద పూజలు చేసిన అనంతరం స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు హోమాలు చేశారు.