నల్లమల పరిధిలోని కృష్ణనంది మార్గం నుంచి వస్తున్న ఎర్రమట్టి టిప్పర్‌ను సీజ్ చేసినట్లు మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నల్లమల అడవి పరిధిలో మట్టిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన వారధి అఖిల్‌తో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేసి టిప్పరును పొలీస్ స్టషన్ కు తరలించి వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.