కోసిగి మండల కేంద్రంలో మూడవ వార్డు లో నివాసముంటున్న బుడిగె మాధవ రెడ్డి తన సొంత ఇంటి నిర్మాణ పనుల్లో పాత మట్టిని తన సొంత ట్రాక్టర్ లో పారబోసేందుకు భూగెని చెరువుకు ట్రాక్టర్ ద్వారా మట్టిని తీసుకెళ్లాడు. ట్రాక్టర్లు వెంట తన ఇద్దరు కుమారులు అలాగే చెల్లి కొడుకు కూడా వెళ్లారు. ట్రాక్టర్ లో ఉండే మట్టిని లిఫ్ట్ ద్వారా కింద పారబోసే క్రమంలో ట్రాక్టర్ పైన ఉన్న పిల్లలను గమనించలేదు. ట్రాక్టర్ కు పైన విద్యుత్ తీగలు తగలడంతో, మల్లికార్జున, అనుమేష్, చిన్నా లకు విద్యుత్ సర్క్యూట్ గురైయ్యారు. వెంటనే గమనించి ట్రాక్టర్ లిఫ్ట్ కిందకు దించేసి ఆ పిల్లలను బంధువుల సహకారంతో కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఆ విద్యార్థులకు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. తమ పిల్లల కు విద్యుత్ షాక్ గురవడంతో బంధువులు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.