తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి పల్లికొండేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో హుండీ ఆదాయం 2లక్షల 98వేల 409 రూపాయలు వచ్చిందని ఆలయ జూనియర్ అసిస్టెంట్ శరవణ తెలిపారు. ఈ ఆదాయం 37 రోజులకు సంబంధించి భక్తులు హుండీలో చెల్లించుకున్న కానుకలని చెప్పారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఇన్చార్జ్ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ ఛైర్మన్ ఏ. వి. ఎం మునిశేఖర్రెడ్డి పాల్గొన్నారు.