వేంపల్లె పంచాయతీ పరిధిలో సెల్ ఫోన్ దొంగను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిరుపాల్‌నాయక్ తెలిపారు. ఈ చోరీ సంఘటనకు సంబంధించి గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. వివరాల్లోకెళ్తే. వేంపల్లెకు చెందిన వడ్డే శివ అను వ్యక్తి గత నెల 30వ తేదీన సదరు పంచాయతీ పరిధిలోని పుల్లయ్యతోటలో నివాసముంటున్న ఆదినారాయణరెడ్డి ఇంటిలో దొంగతనం చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ మేరకు సీఐ సీతారామిరెడ్డి ఆదేశాలతో కేసు పురోగతి సాధించేందుకు ఎస్ఐ తిరుపాల్‌నాయక్ నడంబిగించారు.
ఆయనతో పాటు మరికొంత మంది కానిస్టేబుళ్లను తీసుకుని కడపకు వెళ్లే మార్గంలోని హనుమాన్‌జంక్షన్ వైపు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి వారిని చూసి పారిపోయేందుకు యత్నించారు. సిబ్బంది వెంటాడి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద వివో సెల్‌ఫోన్, 17గ్రాముల బంగారు వస్తువులు లభించాయి. ఇవెక్కడని ప్రశ్నించగా సదరు శివ తాను ఆదినారాయణరెడ్డి ఇంటిలో తస్కరించినట్లు అంగీకరించారన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్న అనంతరం శివను కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.